గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా.. ఎలా మారిందో తెలుసా..?
గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా.. ఎలా మారిందో తెలుసా..? సాధారణంగా ఎవరైనా గుడ్లగూబను (Owl) అశుభానికి ప్రతీకగా భావిస్తారు. రాత్రివేళ గుడ్లగూబలు కూస్తే.. ఏదో ఆపద తలెత్తుతుందని కూడా అభిప్రాయపడుతుంటారు. కానీ హిందూ పురాణాల ప్రకారం.. గుడ్లగూబకు చాలా విశిష్ట స్థానం ఉంది. గుడ్లగూబను సాక్షాత్తూ ఆ మహాలక్ష్మీకి వాహనంగా పరిగణిస్తారు. రాత్రి నాల్గవ జాము తర్వాత.. గుడ్లగూబ ఎవరి ఇంటి మీదైతే వాలుతుందో.. ఆ రోజు నుండి ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉంది. పూర్వకాలంలో ఓ అడవిలో ఓ వృద్ధ జంట కాపురముండేదట. వారెంత కటిక పేదరికంతో జీవించే వారంటే.. కట్టుకోవడానికి వారింట్లో కేవలం ఒకే ఒక్క బట్ట ఉండేది. ఒకరు ఇంట్లో ఉంటే.. మరొకరు అదే బట్ట ఒంటిపై కప్పుకొని యాచనకు వెళ్లేవారు. ఓ రోజు ఆ ఇంటి పెద్ద ఇదే తీరున యాచనకు వెళ్లినా.. ఏమీ దొరక్కపోవడంతో కలత చెంది ఓ చెట్టు క్రింద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. తన కష్టాలను ఆ చెట్టుతో చెప్పుకుంటాడు. దసరా సంబరాల వేళ.. ఆయుధ పూజ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..? అదే చెట్టుపై నివసిస్తున్న గు...