కార్తీక మాసం వలన అద్భుతమైన ఫలితాలు


కార్తీక మాసం వలన అద్భుతమైన ఫలితాలు

పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమైన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు చేసే దానాలు వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈ మాసంలో శక్తి కొలదీ దానధర్మాలు చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్పూర్తిగా, శ్రద్ధంగా చేస్తే మంచి ఫలితం అధికంగా ఉంటుంది. ముఖ్యం గా ఏ రోజు ఎటువంటి దానం ఇస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో తెలుసుకొని దానం చేయడం మరింత మంచిది. ఈ మాసంలో దీపం వెలిగించడం ఎంత పుణ్యమో, దానం చెయ్యడం వలన చేసిన పాపాలు నశించి పుణ్యం పొందవచ్చు. అసలు ఎ రోజు ఏ దానం చేస్తే మంచిదో తెలుసుకుందాం
1. కార్తీక మాసంలో మొదటి రోజు నెయ్యి, బంగారం దానం చేస్తే మంచిది. అలాగే అగ్ని దేవుణ్ణి పూజిస్తే తేజస్సు కలుగుతుంది.
2. కార్తీక మాసంలో రెండవ రోజు కలువ పూలు, నూనె, ఉప్పు దానం చేస్తే మంచిది. అలాగే బ్రహ్మ దేవుణ్ణి పూజిస్తే మనశాంతి లభిస్తుంది.
3. కార్తీక మాసంలో మూడవ రోజు ఉప్పు దానం చేస్తే మంచిది. అలాగే పార్వతి దేవి ని పూజిస్తే సౌభాగ్యం చేకూరుతుంది.
4. కార్తీక మాసంలో నాలుగవ రోజు నూనె, పెసర పప్పు దానం చేస్తే మంచిది. అలాగే గణపతి ని పూజిస్తే సద్బుద్ధి, కార్య సిద్ది ప్రాప్తిస్తాయి.
5. కార్తీక మాసంలో ఐదవ రోజు స్వయంపాకం, విసనకర్ర దానం చేస్తే మంచిది. అలాగే ఆదిశేషున్ని పూజిస్తే మంచి కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.
6. కార్తీక మాసంలో ఆరవరోజు చిమ్మిలి దానం చేస్తే మంచిది. అలాగే సుబ్రమణ్యస్వామి ని పూజిస్తే సత్సంతానం లభిస్తుంది అలాగే జ్ఞాన లబ్ది పొందుతారు.
7. కార్తీక మాసంలో ఎడవ రోజు పట్టుబట్టలు, గోదుమలు, బంగారం దానం చేస్తే మంచిది. అలాగే సూర్యుడిని పూజిస్తే మంచి తేజస్సు, ఆరోగ్యం కలుగుతాయి.
8 .కార్తీక మాసంలో ఎనిమిదవ రోజు యధాశక్తి దానం చేస్తే మంచిది. అలాగే దుర్గా దేవిని కొలిస్తే మంచి దైర్యం విజయం ప్రాప్తిస్తాయి.
9. యథాశక్తి ఎనిమిది రకాల వస్తువులను దానం చేస్తే మంచిది. పితృదేవతలని పూజించడం పితృతర్పణాలు వదిలితే సంతానరక్షణ కలుగుతుంది.
10. కార్తీక మాసంలో పదవ రోజు గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె దానం చేస్తే మంచిది అష్ట దిగ్గజాలను పూజిస్తే యశస్సు ధనప్రాప్తి కలుగుతాయి.
11. కార్తీక మాసంలో పదకొండవ రోజు విభూతిపండ్లు దక్షిణ తో సహా దానం ఇస్తే మంచిది. శివున్ని పూజిస్తే ధన ప్రాప్తి, ఉన్నత పదవి ప్రాప్తిస్తాయి.
12. కార్తీక మాసంలో పన్నెండవ రోజు పరిమళ ద్రవ్యాలు, స్వయం పాకం, రాగి, దక్షిణ దానం చేయడం మంచిది. అలాగే భూదేవి సమిత మహా విష్ణువుని పూజిస్తే బంధ విముక్తి కలుగుతుంది. ధనధాన్యాబివృద్ది మరియు జ్ఞానం ప్రాప్తిస్తాయి.
13. కార్తీక మాసంలో పదమూడవ రోజు మల్లెపూలు, జాజిపూలు వంటి పూలు దానం చేస్తే మంచిది. అలాగే మన్మధుడిని పూజిస్తే వీర్య వృద్ది, మంచి సౌందర్యం కలుగుతాయి.
14. కార్తీక మాసంలో పద్నాలగవ రోజు నువ్వులు, ఇనుము పాడె గేదె దానం చేస్తే మంచిది. యమధర్మరాజు ని పూజిస్తే అకాలమృత్యువులు తొలగుతాయి.
15. కార్తీక మాసంలో పదిహేనవ రోజు వరి అన్నం, భోజనం, వెండి దానం చేస్తే మంచిది. చంద్రున్ని పూజిస్తే మనశాంతి కలుగుతుంది.
16. కార్తీక మాసంలో పదహారవ రోజు నెయ్యి, సమిథలు, దక్షిణ, బంగారం దానం చేస్తే మంచిది. అలాగే అగ్ని దేవుణ్ణి పూజిస్తే మంచి వర్చస్సు, తేజస్సు, పవిత్రత ప్రాప్తిస్తాయి.
17. కార్తీక మాసంలో పదిహేడవ రోజు ఔషదాలు, ధనం దానం చేస్తే మంచిది. అశ్వని దేవతల్ని పూజిస్తే సర్వ వ్యాదులు తొలగి స్వస్థత లభిస్తుంది.
18. కార్తీక మాసంలో పద్దెనిమిదవ రోజు పులిహోర, అట్లు, బెల్లం దానం చేస్తే మంచిది. గౌరి దేవి ని ప్రార్దిస్తే అఖండ సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది.
19. కార్తీక మాసంలో పందొమ్మిదవ రోజు నువ్వులు, కుడుములు, దానమిస్తే మంచిది. అలాగే విఘ్నెస్వరుణ్ణి పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి విజయం ప్రాప్తిస్తుంది.
20. కార్తీక మాసంలో ఇరవయ్యొవ రోజు గోవు, భూమి, సువర్ణ దానాలు చేస్తే మంచిది. నగుల్ని పూజిస్తే గర్బదోష పరిహారం కావింపబడుతుంది, సంతానం కలుగుతుంది.
21. కార్తీక మాసంలోఇరవయ్యొకటొవ రోజు యథాశక్తి దానం చేయడం మంచిది. సుబ్రమణ్యస్వామి ని పూజిస్తే సత్సంతానం, జ్ఞానం, విజయం లభిస్తాయి.
22. కార్తీక మాసంలో ఇరవైరెండోవ రోజు పట్టుబట్టలు, సువర్ణం, గోధుమలు దానం చేస్తే మంచిది, సూర్యుణ్ణి పూజిస్తే ఆయురారోగ్యాలు,సద్భుద్ది కలుగుతాయి.
23. కార్తీక మాసంలో ఇరవైమూడవ రోజు మంగళద్రవ్యాలు దానమిస్తే మంచిది. అలాగే సప్త మాతృకలను పూజిస్తే మాతృరక్షణ కలుగుతుంది.
24. కార్తీక మాసంలో ఇరవై నాలుగవ రోజు ఎర్రని చీర జాకెట్టు, ఎర్ర గాజులు, ఎర్ర పూలు దానం చేస్తే మంచిది. అలాగే దుర్గా దేవి ని పూజిస్తే శక్తిసామర్ద్యాలు, కార్య విజయం కలుగుతాయి.
25. కార్తీక మాసంలో ఇరవై ఐదవ రోజు యథా శక్తి దానమిస్తే మంచిది. అష్ట దిక్పాలకులను పూజిస్తే అఖండ కీర్తి ప్రతిష్ఠలు, ఉన్నత పదవులు లభిస్తాయి.
26. కార్తీక మాసంలో ఇరవై ఆరవ రోజు ఉప్పు పప్పులని (వంటకు ఉపయోగించే వస్తువులు) దానం చేస్తే మంచిది. అలాగే కుబేరుణ్ణి పూజిస్తే ధన ప్రాప్తి, సిరిసంపదాభివృద్ది కలుగుతుంది.
27. కార్తీక మాసంలో ఇరవై ఏడవ రోజు ఉసిరికాయ, వెండి, సువర్ణం, దానం, దీపం దానం చేస్తే మంచిది. కార్తీక దామోదరుణ్ణి పూజిస్తే రాజ భోగాలు ప్రాప్తిస్తాయి.
28. కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదవ రోజు నువ్వులు, ఉసిరికాయ దానమిస్తే మంచిది ధర్మదేవుణ్ణి పూజిస్తే సకల రోగాలు నయమవుతాయి.
29. కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజు శివుడిని పూజించడం శివలింగం ,వీభూది పండు ,బంగారం యధా శక్తిగా దానం ఇస్తే అకాల మృత్యు దోషాలు తొలగుతాయి, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.
30. కార్తీక మాసంలో ముప్పైవ రోజు సర్వదేవతలను పూజించడం , నువ్వులు, ఉసిరి దానం ఇస్తే ఆత్మ స్థైర్యం కలుగుతుంది, కుటుంబ క్షేమం కలుగుతుంది.

Comments