ఈ పుణ్యస్థలాన్ని సందర్శిస్తే పెళ్లి అడ్డంకులు తొలగిపోతాయట!
ఈ పుణ్యస్థలాన్ని సందర్శిస్తే పెళ్లి అడ్డంకులు తొలగిపోతాయట!
బలి చక్రవర్తి
పాపవిముక్తి కోసం తపస్సు చేసిన స్థలం. ఆయన తపస్సుకు మెచ్చి శ్రీమహావిష్ణువు
వరాహరూపంలో ప్రత్యక్షమై అతన్ని పాపవిముక్తుడిని చేసిన పుణ్యస్థలం తిరువిడందై.
అంతేనా.. వరాహపెరుమాళ్ల వారు బ్రహ్మచారిగా వచ్చి కాలముని విజ్ఞప్తి మేరకు రోజుకు
ఒకరి లెక్కన 360 రోజుల్లో 360 మందిని వివాహం చేసుకున్నారు. చివరి రోజున అందరూ
చూస్తుండగానే 360 మంది యువతులను ఓ
శక్తిగా ఏకం చేశారు. అంతటి మహిమాన్విత స్థలం గురించిన ప్రత్యేక కథనం…. ఇల్లు కట్టి చూడు – పెళ్లి చేసి చూడు… అన్నారు పెద్దలు. ఈ రెండు ఒకేసారి జరగాలంటే ఎంతో కష్టపడాలి.
అయితే ఓ ఆలయాన్ని సందర్శిస్తే ఇల్లు కట్టేయొచ్చు. పెళ్లికూడా చేసేయొచ్చు. ఆ
పుణ్యక్షేత్రం సముద్రపు అలలతో అలరారుతున్న కోవలానికి సమీపంలోని తిరువిడందైలో ఉంది.
త్రేతాయుగంలో మేఘనాథన్ అనే రాక్షసుని కుమారుడైన బలిచక్రవర్తి దేవతలతో యుద్ధం
చేశాడు. ఆ పాపం నుంచి విముక్తి పొందేందుకు అసురకుల కాల నల్లూరు అనే ప్రాంతంలో
పెరుమాళ్ల వారిని తలచి తపస్సు చేశాడు. బలి చక్రవర్తి తపస్సుకు మెచ్చి శ్రీ
మహావిష్ణువు వరాహరూపంలో ప్రత్యక్షమై అతని పాపాలను తొలగిస్తాడు. ఆపై బలి చక్రవర్తి
కోరిక మేరకు అదే ప్రాంతంలో స్వామివారు కొలువయ్యారు. అప్పటి నుంచి ఆ స్థలం వరాహపురి
అని పిలువడుతోంది. 360 రోజులు.. 360 పెళ్ళిళ్ళు కాలముని తన 360 మంది అమ్మాయిలతో కలిసి జీవనం సాగించేందుకు
వరాహపురికి విచ్చేశాడు. ఇదే ప్రాంతంలో తన కుమార్తెలను పెంచి పెద్ద చేయాలనుకుంటాడు.
ఈ 360 మంది అమ్మాయిలు
వరాహస్వామి పట్ల భక్తిభావంతో పూజించేవారు. అలా ఆ అమ్మాయిలకు పెళ్ళీడు వచ్చాక
వరాహమూర్తిని తన 360 కుమార్తెలను
వివాహం చేసుకోవాల్సిందిగా వేడుకుంటాడు. ఓ రోజు వరాహ పెరుమాళ్ల వారు బ్రహ్మచారిగా
వచ్చి కాలముని విజ్ఞప్తి మేరకు రోజుకు ఒకరి లెక్కన 360 రోజుల్లో అందరినీ వివాహం చేసుకున్నారు. చివరి రోజున అందరూ
చూస్తుండగానే 360 మంది యువతులను ఓ
శక్తిగా ఏకం చేశారు. ఆ శక్తి అఖిలవల్లిగా పిలువబడుతోంది. అలా అఖిలవల్లిని ఎడమవైపు
ఉంచుకుని గర్భగుడిలోకి వెళ్లిన స్వామివారు వరాహమూర్తిగా, లక్ష్మీ వరాహమూర్తిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
వరాహపురిలో ఆది వరాహ పెరుమాళ్ అఖిలవల్లి తాయారు, లక్ష్మీదేవితో పాటు భూమిపై ఓ కాలు మోపినట్లుంటారు. ఆయన
పాదాల చెంత ఆదిశేషుడు కొలువైవుంటారు. ఆలయ ప్రాకారంలో వినాయకుడు, వైష్ణవి సన్నిధులున్నాయి. 12 మంది ఆళ్వారులు, మహామునులు, రామానుజ సన్నిధులున్నాయి.
ఈ ఆలయంలోని ప్రత్యేక సన్నిధానంలో నాచ్చియార్ సన్నిధి వుంది.
Comments
Post a Comment