హీరో సుమన్‌ ముఖ్య అతిథిగా ‘దుర్మార్గుడు’ ఆడియో విడుదల

ఆరాధ్య సమర్పణలో అమృత మూవీ క్రియేషన్స్‌ బ్యానేర్‌పై రాజవంశీ నిర్మించిన చిత్రం ‘దుర్మార్గుడు’. విజయ్‌ కృష్ణ , ఫిర్దోస్‌ భాను హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సునీల్‌ జంపా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోను ప్రముఖ హీరో సుమన్‌ విడుదల చేశారు. ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్‌, బెక్కం వేణుగోపాల్‌, బిగ్‌ సీడిని హీరో సుమన్‌ నిర్మాత సి.కళ్యాణ్‌, బెక్కం వేణుగోపాల్‌, టి. రామ సత్యనారాయణ సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా..
ముఖ్య అతిథి హీరో సుమన్‌ మాట్లాడుతూ – ”శ్రావణ భార్గవి పాడిన ప్రోమో సాంగ్‌ హార్ట్‌ టచింగ్‌గా ఉంది. లిరిక్స్‌ కూడా అద్భుతంగా కుదిరాయి. హీరో విజయ్‌కృష్ణ మొదటి సినిమా అయినా బాడీ లాంగ్వేజ్‌ చాలా చక్కగా ఉంది. డైరెక్టర్‌ పనితనం కనపడుతుంది. తక్కువ బడ్జెట్‌ సినిమా అయినా విజువల్స్‌ చాలా బాగున్నాయి. అందుకు డి.ఓ.పి మల్లిక్‌ని అభినందిస్తున్నాను. హీరోయిన్‌ చాలా అందంగా ఉంది. మొదటి సినిమాకే మంచి పెర్‌ఫార్మెన్స్‌ చేసే అవకాశం లభించింది. చిన్నికృష్ణ మ్యూజిక్‌ కూడా చాలా బాగుంది. సినిమా ఫుల్‌ ప్యాకేజీలా ఉంది. తప్పకుండా విజయం సాధిస్తుంది” అన్నారు.
ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్‌ మాట్లాడుతూ – ”ట్రైలర్‌ చూశాక హీరోలో మంచి ఈజ్‌ కనపడింది. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. రాజవంశీ చాలా సిన్సియర్‌ ప్రొడ్యూసర్‌. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ చాలా బాగున్నాయి. సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Comments