కార్తీక మాసము–తులసి పూజ
కార్తీక శుక్ల
ద్వాదశి , పౌర్ణమి, అమావాస్య.
కార్తీక సోమవారాలు
1. శివప్రీతి
కరమైనవి అయితే ఏకాదశి , ద్వాదశులు
విష్ణువుకు ప్రీతి పాత్రమైనవి . బిల్వపత్రములు శివుడికైతే , తులసీ దళములు , ఉసరి ఫలములు విష్ణువుకు. ఇంక కార్తీక మాసములో విడువ వలసినవి
, నల్లావాలు , కందులు , మినుములు ,పెసలు , నువ్వుల నూనె మరియూ బహుబీజకములైన వంకాయలు , మెంతులు , మొదలగునవి. కార్తీకమాసములో కేశకర్తనము [ క్షవరము ]
చేసుకొనరాదు.
2. పూజా ప్రతీకగా
విష్ణు సంబంధమైన సాలగ్రామము అగ్రగణ్యమైతే , పూజాద్రవ్యములలో తులసిది అగ్ర స్థానము. సాలగ్రామము లేనిదే
పుణ్య తీర్థము లేనట్టే , తులసి లేనిదే పూజ
లేదు. జంతువులలో గోవు , మనుషులలో జ్ఞాని , సస్యములలో తులసి ప్రత్యేకమైనవి. దేవతలు లేని ప్రదేశమే
లేదు , భగవంతుడు లేని
చోటే లేదు. అయినా , సకల దేవతలు
వెలసిన చోట్లు రెండే రెండు. ఒకటి గోవు , రెండు తులసి. తులసిలో సకల దేవతలే కాక పుష్కర క్షేత్రములు , గంగాది సకల తీర్థములు కూడా ఉన్నాయని పురాణములలో
వర్ణించబడినది. చరించు దేవాలయం గోవైతే , సస్యరూపమైన దేవాలయమే తులసి. తులసి అంటేనే ’ తులనము లేని సస్యము ’ అనగా , దేనితోనూ సమానము
కాని సస్యము. తులసికి అధిదేవత సాక్షాత్తూ మహా లక్ష్మియే ! తులసి గురించి , ” తులస్యుపనిషత్ ” అను యొక ఉపనిషత్తే ఉన్నతర్వాత , తులసి మాహాత్మ్యము ఎంత గొప్పదో అర్థము చేసుకోవచ్చు.
మహాలక్ష్మి సాన్నిధ్యము వల్లనే తులసి కూడా ఐశ్వర్యప్రదమైనది. పద్మ పురాణము , స్కంధ పురాణము , బ్రహ్మాండ పురాణము మొదలగువాటిలో తులసి మహిమ కీర్తించబడినది.
3.యే దానము
చేయవలెనన్నా తులసి ఉండవలెను. జపతపములు పూర్ణముగా ఫలించవలెనంటే తులసిమాల
అత్యావశ్యకము. తులసి ఎక్కడుంటే అక్కడే విష్ణువు సన్నిధానముండును. తులసి
మాలలేకున్నచో ఒక ఆకైనా చాలు. తులసీ కాష్టము కూడా శ్రేష్టమే. తులసి ఎండిపోయి ఉన్ననూ
యే దోషమూ లేదు. అనివార్యమైనపుడు , నిర్మాల్య
తులసిని కూడా మరలా కడిగి , పూజకు
ఉపయోగించవచ్చును. అథమ పక్షము తులసీ నామమును జపించినా విశేష ఫలమే. ఈ తులసి , దర్శనమాత్రము చేతనే సకల పాపములనూ పరిహరించును.
స్పర్శనము చేత శరీరమును పావనమొనరించును. నమస్కారము చేత రోగములను పోగొట్టును, తులసినీటిని ప్రోక్షణ చేసుకున్నంత మాత్రమున మృత్యు
భయమును పోగొట్టును , తులసి మొక్కను
ఇంటిలో పెంచుకొనుట వలన కృష్ణ భక్తిని పెంపొందించును. శ్రీహరి పాదార్పణము చేసినంతనే
ముక్తి ఫలము దొరకును. ఈ తులసి , రాక్షస శక్తులను
కూడా నశింపజేయగల పరిణామకారి. ఆ కారణమువల్లనే పురాణములన్నీ , ’ సదా తులసి ఇంటియందు ఉంచుకోతగినది ’ యని ఘోషిస్తాయి. ఈ తులసికి పురాణములలో అనేక నామములు
గలవు.
4. తులసిని
బృందావనములో పెంచి పూజించుట వలన విశేష పుణ్యము దొరకును. కార్తీక పౌర్ణమి నాడు
తులసి ప్రాదుర్భవించినది కాబట్టి ఆ దినమే తులసీ జయంతి. ఆ దినము తులసిని భక్తితో
పూజించువారు సకల పాపములనుండీ ముక్తిని పొంది విష్ణులోకాన్ని చేరగలరని బ్రహ్మ
వైవర్తస పురాణము తెలుపుతుంది.
5. కార్తీకమాసము
తులసి జన్మ మాసము కాబట్టే ఆ మాసములో తులసి పూజకు అంత ప్రాముఖ్యము. ఉత్థాన ద్వాదశి
నాడే తులసీ వివాహమైన పుణ్యతిథి. ఆనాడు విష్ణువును ఉదయమే పూజించి తులసీదళాన్ని
సమర్పించవలెను. సాయంత్రము , తులసి
సాన్నిధ్యములో ధ్వజపతాక రంగవల్లుల అలంకారము గావించి , దామోదర రూపుడైన ఆ శ్రీహరిని పూజించాలి. తోరణములతో
శోభించే మంటపమునేర్పరచి , ముత్యాల మాలలతో
అలంకృతమైన సింహాసనములో దామోదర మూర్తిని పంచరాత్ర విధానముతో భక్తితో పూజించవలెను.
మనోహరములైన రకరకాల పూలమాలలతోను , అనేక విధములైన
రత్నములతోను , అసంఖ్యాకమైన
నేతిదీపాలతోను శ్రీహరిని ఆరాధించవలెను.
6. పాలు , వెన్న , పెరుగు , నేయిలను , వాటితో చేసిన పంచ భక్ష్యాలను , సుగంధ ద్రవ్య పూరితమైన జలములను , లవంగ సహితమైన తాంబూలమును , దక్షిణతో పాటు సమర్పించవలెను. పరిమళభరితములైన వివిధ
పుష్పాలతో సమర్చించవలెను. తులసీ దళములచేతను, ఉసరిక ఫలముల చేతను , పూజింపవలెను. ఉసరికలు మహా విష్ణువుకు ప్రీతి పాత్రమే కాదు ,
సర్వ పాపములనూ పరిహరించగలదు. అందుకే , ఉసరి చెట్టు నీడలో పిండదానమాచరించినవాని పితరులు
మాధవుని అనుగ్రహము వలన ముక్తి పొందుతారు. కార్తీకమాసములో శరీరం నిండా ఉసరిఫలాల
గుజ్జును పూసుకొని , ఉసరికాయలతో
అలంకరించుకొని , ఎండిన ఉసరి
ఫలాలను ఆహారముగా స్వీకరించిన నరులు నారాయణులే అవుతారు. ఉసరి చెట్టు నీడలో
విష్ణువును అర్చిస్తే వారు అర్పించిన ప్రతి పుష్పం వల్లనూ అశ్వమేధ ఫలం లభిస్తుంది.
కార్తీక మాసములో ధాత్రీ వృక్షములు[ ఉసరి చెట్లు ] గల వనములో విష్ణువును
చిత్రాన్నములతో సంతోషపరచి , బ్రాహ్మణులను
భుజింపజేసి , తాము భుజించాలి.
7. కార్తీక మాసములో
రోజు విడచి రోజు మూడు రాత్రులు ఉపవాసము చేసిన కానీ , ఆరు , పన్నెండు , లేదా పక్షము రోజులు లేదా నెలరోజులూ , ఒంటిపూట భోజనము చేసి గడపినవారు పరమపదాన్ని
చేరుకుంటారు. ప్రతి సాయంకాలమూ ఇంటి బయట నువ్వులనూనెతో ఆకాశదీపమును పెట్టవలెను.
చతుర్దశి , అమావాస్యలలో
ప్రదోషకాలపు దీపము పెట్టటం వలన యమ మార్గాధికారులనుండీ విముక్తుడౌతాడు. కృష్ణ
చతుర్దశి యందు గోపూజ చేయాలి. కార్తీక పౌర్ణమిలో దేవాలయములలో దీపాలు పెట్టాలి.
పురుగులు , పక్షులు , దోమలు , వృక్షములు, మరియూ నీటిలోను , భూమియందు తిరుగుతున్న జీవులూ– ఈ దీపాలను చూస్తే తిరిగి జన్మను పొందవు. చండాలులు , విప్రులూ కూడా
ఈ దీపాలను చూస్తే మరుజన్మను పొందరు.
ఈ దీపాలను చూస్తే మరుజన్మను పొందరు.
8. కార్తీకమాసమందు
కృత్తికా నక్షత్రము రోజున కార్తికేయుని దర్శనము చేసుకున్నవారు ఏడు జన్మలు
విప్రులౌతారు. ధనవంతులూ , వేదపారగులూ
అవుతారు. కార్తీకమాస నియమాలను పాటించి సర్వులూ శుభములను , సుఖములను పొందెదరు.
Comments
Post a Comment