ఆర్టిస్టుల‌కు `గోల్డేజ్ హోమ్` ఇవ్వ‌డం నా డ్రీమ్‌! -`మా` అధ్య‌క్షులు శివాజీ రాజా

ప‌రిశ్ర‌మ‌లో మూడు ద‌శాబ్ధాల అనుభ‌వం ఉన్న న‌టుడిగా శివాజీ రాజా సుప‌రిచితం. మూవీ ఆర్టిస్టుల సంఘంలో ప‌లు బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించిన అనుభ‌వ‌జ్ఞుడు. ప్ర‌స్తుతం `మా` అధ్య‌క్షుడిగా ఆయ‌న ఎన్నో ప్ర‌యోజ‌న‌కర కార్య‌క్ర‌మాల్ని అమ‌ల్లోకి తెచ్చి స‌క్సెస్ చేయ‌డంపై టాలీవుడ్ స‌హా ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. పేద క‌ళాకారుల కుటుంబాల్లోని పిల్ల‌ల కోసం విద్యా ల‌క్ష్మి, క‌ళ్యాణ ల‌క్ష్మి వంటి ప‌థ‌కాల్ని ప్ర‌వేశ పెట్టారు. 35 మందికి వృద్ధుల‌కు ఫించ‌న్ రూ.5000కు పెంచి అంద‌రి మెప్పు పొందారు. ప్ర‌స్తుతం ఓల్డేజ్ హోమ్ (వృద్ధాశ్ర‌మం) నిర్మాణం, మా అసోసియేష‌న్ సొంత భ‌వంతి నిర్మాణ‌మే ధ్యేయంగా ఆయ‌న ప‌ని చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 26న ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్ లో విలేక‌రుల‌తో ముచ్చ‌టించారు.
*నాకు పుట్టిన‌రోజులు చేసుకునే అల‌వాటు లేదు. 32 ఏళ్ల‌ కెరీర్‌లో ప‌రిశ్ర‌మ‌లో ఇదే తొలిసారి. ఓసారి మిత్రుల కోసం బ‌ర్త్ డే పార్టీ ఇచ్చాను. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడే బ‌ర్గ్ డే. ఈసారి మ‌రిన్ని మంచి పనుల గురించి చెప్పేందుకు ఇదో వేదిక‌.
ఇక్క‌డ పుట్టినందుకు ఎవ‌రికైనా దానం చేయ‌డం.. సాయం చేయ‌డం అనేదే చేస్తున్నా.
*మా అధ్య‌క్షుడిగా రెండేళ్లు పూర్త‌యింది. ఆర్టిస్టులంతా మ‌రోసారి అధ్య‌క్షుడిగా ఉండాల‌ని కోరారు. అయితే నేను ఉండ‌ను.. ఎవ‌రైనా పోటీ చేయండి అని అన్నాను. కానీ ఈ ఒక్క‌సారికి చేయండి అంటూ ఆర్టిస్టులు అడిగారు.

Comments