అమెరికానంద్: NRI Thanksgiving Deals
అమెరికానంద్: NRI
Thanksgiving Deals
మధ్యాహ్నం తిన్న ఆ రెండు టర్కీ కోడిముక్కలు అరగక ఇంకా
తేనుపులు వస్తున్నా, మిగిలిపోయిన
చికెన్ బిర్యానీ ఇంకాస్త లాగించి Thanksgiving డీల్ పేపర్లన్నీ ముందరేసుకొని, ఎవరు ఏ షాప్ కి
వెళ్లాలా అని ఓ strategy వేస్కోని, సోఫా లో
రిక్లైనెర్ లాగి కాళ్లు చాపి
ఓ కునుకేస్తే, డోర్ బస్టర్ deals అన్నీ మనకే
వచ్చేసినట్టు పిచ్చికల వచ్చి (volume of water raised/displaced must be equal to the volume of the part of
his body he had submerged అని స్పురించగానే Syracuse streets లో యురేకా అని
అరుచుకొంటూ బట్టలు లేకుండా బయటకి పరుగులు పెట్టిన Archimedes కలలో గుర్తొచ్చి), “యురేకా!”, “I got it” అని పైకి గట్టిగా అరుస్తుంటే, ఏవండీ ఎందుకట్టా
అరుస్తున్నారు అని మంచి-సగం [better-half] గట్టిగా కుదిపేసరికి ఈ లోకంలోకి వచ్చి, కాస్త సిగ్గుపడి, ఇది కలా? అని
ఉసూరిమనిపించి కొన్ని నీళ్లు మొఖం మీద పొస్కోని, నోరు పుక్కిలించి, శ్రీమతి పెట్టిని టీ త్రాగి, మరింత టీ, కాఫీ మగ్ లో
పోస్కొని కారు start చెయ్యబోతే, అది కాస్తా
మిన్నెసోటా చలికి మొరాయించగా, పోయినేడాది డీల్ లో కొన్న jump starter విషయం గుర్తొచ్చి, మనల్ని మనమే బేషజాలు లేకుండా, భేష్ అని
కితాబిచ్చుకొని, jump starter ని re-charge చేసి, కారు start చేసి అరెరే!
అరగంట లేటయిపోయిందేనని తిట్టుకొంటూ బయలుదేరి చాలా దూరంగా దొరికిన parking place లో కారు park చేసి, ఎముకలు కొరికే
మిన్నెసోటా చలిలో seal ని వేటాడే
ఎస్కిమోలాగా అన్నీ తొడుక్కొని line లో నిల్చొని ఎదురు చూస్తుండగా, shop door తెరవగానే ఓ చిన్న
తొక్కిసలాట లాగ జరిగితే, Thanksgiving రోజున అమెరికన్లు
కూడా India లో లాగ queue ధర్మం పాటించరేమి
చెప్మా అనుకొంటూ (అర్ధ శాస్త్రం [Commerce] లో చదివిన Demand vs. Supply equilibrium గుర్తుకొచ్చి, ఈ చిన్న సూత్రం
మనుష్యుల నడవడిని ఇంతగా influence చేస్తుందా అని)
అబ్బుర పడుతూ షాప్ లోపలికి వెళ్లగా, అప్పటికే డోర్ బస్టర్ deals అన్నీ అయిపోయి డీల్ పేపర్లో circle చేసిన ఏ వస్తువూ
దొరక్కపోగా, అందని
ద్రాక్షపళ్లు పుల్లన typeలో, ఎదో circle చేసాం గాని అది మనకు ఎందుకూ
పనికిరాదులే అని అనుకొని సర్ది చెప్పుకుంటూ, కోపంతో కూడిన నిరాశతో నిండిన ఉక్రోషంతో aisles పక్కనున్న
వస్తువులు కొన్ని చూసి వాటికి main-in rebate ఉందిలే అని సర్దుకొని, పొయినేడాది mail-in rebate 30 రోజుల్లో submit చెయ్యక అది expire అయిపోయిందని, డబ్బులు తిరిగి
రాలేదని గుర్తొచ్చినా కూడా ఈసారి తప్పకుండా submit చేద్దాంలే అని గట్టిగా తీర్మానించుకొని, pay చేయడానికి పావు
మైలు queueలో wait చేసి, bill కట్టేసి, మరో లైన్లో mail-in rebate form కోసం wait చేసి బయట పడి, ఇంటికి
వచ్చేసరికి తెల్లారి, ఒళ్లు నొప్పులతో
అలసిపోయిన శరీరాన్ని మంచం మీద పడేసేసరికి వెంటనే గట్టినిద్ర పట్టేలోగా, శ్రీమతి కూడా strategy ప్రకారం వేరే
షాప్ లో కొని తిరిగి వచ్చేయగా లేచి, ఆలీబాబా నలభై దొంగల కథలో, వాళ్ల loot అంతటినీ
పంచుకోవడానికి పరిచినట్టుగా పరిచి compare చేయడం మొదలు పెట్టగా, నేను తెచ్చిన ఒక్కో వస్తువునూ చూసి శ్రీమతి, ఇది already పోయినేడాది
కొనేసాం, ఇప్పటివరకూ
ఒక్కసారి కూడా వాడలేదు, basement లో భద్రం గా
అలానే ఉంది అని చెప్పేసరికి, ఈ విషయం నాకెందుకు గుర్తుకు రాలేదా అని మదనపడి, తను తెచ్చిన
వస్తువులు చంద్రముఖిలో జ్యోతిక లాగా కళ్లు పెద్దవి చేసి చూపిస్తుంటే, ఇదో రకమైన trans అని మనసులో అనుకొంటూడగా, వాళ్ల ఫ్రెండ్
నుండో Whatsapp వచ్చి, ఈ వస్తువులన్నీ
వాళ్లకు వేరే షాప్ లో 50 cents నుండి 10 dollars వరకు తక్కువగా
వచ్చాయని తెలిసేసరికి, దగాపడ్డామని
దిగాలుపడి, brunch కి ఉప్మా, పెసరట్టు తిని, ఈ వస్తువులన్నీ return చేయడానికి
బయలుదేరేసరికి అప్పటికే పరిచయమున్న మొఖాలో పది queue ధర్మం పాటిస్తూ returns queueలో కనబడగా ఒకర్నొకరు చూసి పక్కున నవ్వుకొని, వస్తువులన్నీ return చేసి, రెండురోజులాగితే
మళ్లీ cyber Monday
sale లో మన luck check చేసుకొందాములే అని positive noteతో బయటికి వచ్చి, కారు start చేయగా, gas అయిపోయినట్ట్లుగా dashboard లో yellow light వెలుగుతూంటే, gas కొట్టించి దాని bill చూస్కోని, “సంచి లాభం చిల్లు కూడబెట్టినట్టు” మరియు “ఏబ్రాసికి పని
ఎక్కువ, లోభికి ఖర్చు
ఎక్కువ” లాంటి
చిన్నప్పుడు పెద్దవాళ్లు చెప్పిన సామెతలన్నీ గుర్తుకొస్తుండగా ఇంటి ముఖం పట్టితిమి.
— ఇదండీ మన
అమెరికానంద్ గారి NRI Thanksgiving
exaggerated to the core —-
Like it, Comment
it and/or share it. But do something this Thanksgiving.
1 Chronicles
16:34 Give thanks to the LORD, for he is good; his love endures forever.
1 Thessalonians
5:18 give thanks in all circumstances; for this is God’s will for you in Christ
Jesus.
కలం పేరు(pen name): అమెరికానంద్
Comments
Post a Comment