అమెరికాలో గోదారి కలువ. – Part I


అమెరికాలో  గోదారి కలువ. – Part I
  
    బిందు ఒక మధ్య తరగతి అమ్మాయి. పుట్టింది పెరిగింది, గోదావరి నది ఒడ్డున ఒక చిన్న వూరు లో , అటు పల్లెటూరు కాదు …  ఇటు పట్నం కానీ ఆ వూరికి వెస్ట్రన్ కల్చర్ ప్రభావం పెద్దగా లేదు అనే చెప్పాలి. సినిమాల ప్రభావం కాలేజీ యువత మీద బాగానే ఉన్నా, మరీ పెద్ద నగరాల్లో యువత కు ఉండే  పోకడ మాత్రం ఎక్కడా   కనిపించదు. కాలేజీ నుండి నేరుగా ఇంటికి వెళ్లే ఆడపిల్లలు, స్నేహితులతో సినిమాకి వెళ్ళాలి అంటే మాత్రం తల్లి తండ్రుల అనుమతి తీసుకోవాల్సిందే.
క్లాస్ లో సరి అయిన మార్కులు రాక పొతే, టీచర్లులెక్చరర్లు పేరెంట్స్ కి వెంటనే లెటర్ పంపే సాంప్రదాయం, కాలేజీ కి యూనిఫార్మ్ వేసుకొనే సంస్కృతీ ఇంకా కొనసాగుతుంది.
ఈ వాతావరణంలో పెరుగు తున్న బిందు మంచి మెరిట్ స్టూడెంట్. క్లాస్ లో ఎప్పుడూ ఫస్ట్ రాంక్. పొరపాటున సెకండ్ రాంక్ వస్తే ఇక ఆ పూట పస్తులు, ఏడుపులు బిందు వాళ్ళ కుటుంబ సభ్యులకు అలవాటైపోయింది.  బిందు తండ్రి వెంకట్రావు MRO ఆఫీస్ లో క్లర్క్ . తల్లి మాధవి డిగ్రీ చదివిన హౌస్ మేకర్.
ఎదో ఒకసారి సెకండ్ రాంక్ వస్తే నష్టం ఏమీ లేదు లేమ్మా ….” అని తల్లి తండ్రి ఎంత చెప్పినా, బిందు మాత్రం ఆ బాధ తట్టు కోలేక నిద్రాహారాలు మాని కనీసం రెండు రోజులు పాటు దీర్గాలు తీస్తూనే ఉంటుంది.
ఇంట్లో టి.వి లో తప్ప థియేటర్ కు వెళ్లి సినిమాలు కూడా చూడని బిందు ధ్యాస అంతా చదువు మీదే . చిన్నప్పటి నుండి తనకు క్లాస్ మెట్ స్నేహితురాలు అయిన శైలజ తో, తన తమ్ముడు భరత్ తో కాసేపు చెస్ , లాంటి ఆటలు , సరదా కబుర్లు తప్ప ఇక వేరే వ్యాపకం ఏమీ లేని అమ్మాయి బిందు.
విశాలమైన గుండ్రటి కళ్ళు, చక్కటి చిన్ని ముక్కు, తీర్చి దిద్దినట్టుండే ఎర్రటి పెదవుల కు, బిందు అమాయకత్వం మరింత అందాన్నిస్తుంది .
అటు మరీ సన్నగా కాదు కానీ, మితమైన చక్కటి శరీర ఆకృతి  తో చూడగానే ఈ అమ్మాయి బాగుంది అనిపించే పర్సనాలిటీ. కాక పొతే తన సాంప్రదాయ వస్త్ర ధారణ, ఈ కాలం అమ్మాయిలకు వుండే ఫ్యాషన్ సెన్స్ లేకపోవడం వలన చూడగానే తళ తళ లాడుతూ ఆకర్షణీయంగా మాత్రం కనిపించదు.
కొంచెం మొహానికి ఫేర్ అండ్ లవ్లీ అయినా పూయవే అని తల్లి మొత్తు కుంటే తప్ప, మామూలు గా ఏ క్రీమ్ లు వాడదు.   కాలేజీ కి వెళ్లే టప్పుడు, తల మాత్రం దువ్వుకుని చక్కాగా రెండు జడలు వేసుకొని, లంగా వోణీ లో కడిగిన ముత్యం లా, చదువుల సరస్వతి లా నడిచి వెళుతుంటుంది.
చెక్కినట్టుండే చక్కటి నడుము వంపు, తాను ఎలా నడిచినానెమలి నడిచి నట్టు వయ్యారంగా ఊగుతూ, పొడవైన రెండు జడల ను ఎత్తైన పిరుదులకు అటు ఇటు మెత్తగా తాకిస్తూ   అబ్బాయిల గుండె  వేగాన్ని మాత్రం పెంచుతుంటుంది.
ఎంతో కష్ట పడి ఎత్తు చెప్పులు వేసుకొనిరోజుల కు రోజు లు ట్రైనింగ్ తీసుకొని  మరీ నడిచే కృతిమ కాట్ వాక్లు, తెచ్చి పెట్టుకొని వయ్యారంగా నడవాలని ప్రయత్నం చేసే సిటీ అమ్మాయిల డిస్కో షేక్ లు అన్నీ …   ప్రకృతి సిద్ద మైన ఈ వయ్యారి గోదారి ముందు దిగదుడుపే !!
ఇక పొతే మన గోదారి అమ్మాయి కి  దేవుడు అంటే మహా నమ్మకం ,… అంతకు మించి భయం. పొద్దున్నే దేవుడికి దణ్ణం పెట్ట కుండా కాలేజీ కి పోయే ప్రసక్తే లేదు. ఏదైనా చిన్న బాధ లేదా కష్టం కలిగితే ఈ రోజు దేవుడి కి కోపం వచ్చే పాపం ఎదో చేసాను …. అని తెగ మదన పడి పోయి , పది సార్లు చెంపలు వేసుకొని, దేవుడి ముందు గుంజీలు తీసేస్తుంది.
కాలేజ్ లో అబ్బాయిలు వేసే పిచ్చి జోకులు పెద్దగా పట్టించు కొక పోయినా, ఒక్కో సారి మనసు కు తగిలి బాధ కలిగిస్తుంటాయి. అలాంటి సందర్భంలో తన తల్లి మాధవి బిందు కు బెస్ట్ ఫ్రెండ్ . తనలో కలిగే అన్ని రకాల ఆలోచనలను బాల్య స్నేహితురాలు శైలజ తో కానీ తల్లి తో కానీ మనసు విప్పి చెప్పేస్తుంది . దాని వలన తన మనసు కొంచెం తేలిక పడి, మళ్ళీ చదువు మీద ధ్యాస పెట్ట కలుగుతుంది.
ఎంతో కష్టపడి చదివి, అమెరికాలో హయ్యర్ స్టడీస్ కి వెళ్లాలని బిందు కోరిక. GRE , TOEFL లాంటి పరీక్షలు వ్రాసి మంచి స్కోర్ తెచ్చుకుంది. తనకు వరసకు మేనమామ అయ్యే ఒకాయన అమెరికాలో స్థిరపడి వున్నాడు. అతని సహాయంతో మంచి కాలేజీ లు వాటి వివరాలు తెలుసుకొని వాటి అన్నిటికీ అడ్మిషన్ కోసం అప్లై చేసింది.
బిందు కు వుండే అకడమిక్ స్కోర్ లకు అమెరికాలో కాలేజీలన్నీ ఆమె కు స్వాగతం చెప్పి , అడ్మిషన్ ఆఫర్ చేశాయి.
అది తెలిసిన సమయం లో బిందు తో సహా తండ్రి వెంకట్రావు , తల్లి మాధవి ల సంతోషం తో కుటుంబం కళ కళ లాడింది.
తన ఆఫీసు, ఇల్లు తప్ప మరో లోకం తెలీని  వెంకట్రావు కు లో లోపల కొంచెం దిగులు గా ఉంది. కూతురు అమెరికాలో ఎలా బతక గలదో, ఒక చిన్న ఊరి లో, అతి చిన్న ప్రపంచంలో పెరిగిన తన చిట్టి తల్లి …. అమెరికా లాంటి పెద్ద దేశంలో ఏమైపోతుందో అని ఆయన కు భయం తో కూడిన ఆలోచన.
తల్లి మాధవి మాత్రం , తన కూతురు కూడా  తన లాగా చదువు కొని కూడా, …. వంట ఇంటి కి పరిమితం కాకూడదని, హయ్యర్ స్టడీస్ కు వెళ్లి మంచి ప్రొఫెషన్ లో సెటిల్ అవ్వాలని కలలు కంటుంది. తమ దగ్గరి బంధువులు చాలా మంది అమెరికాలో సెటిల్ అయ్యారు తన పిల్లలు ఎందుకు ఆలా కాకూడదన్నది, ఆమె పట్టుదలతో కూడిన ఆలోచన.
అమెరికన్ కాలేజీల నుండి అడ్మిషన్ ఆఫర్ రాగానే , స్టూడెంట్  వీసా కి అప్లై చేసింది బిందు.  కొన్ని రోజుల కు ఇంటిల్లి పాదీ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.
అదే వీసా స్టాంపింగ్ రోజు. రేపు ఉదయం 10 గంటల కు అమెరికన్ కన్సొలేట్ లో అప్పాయింట్మెంట్.
రెండు రోజులుగా బిందు మొక్కని దేవుడు లేడు . వీసా స్టాంపింగ్ అయితే తీర్చుకోవాలిసిన మొక్కుబడుల లిస్ట్ పెద్దగానే తయారు అయింది .
మాధవి పరిస్థితి కూడా అంతే , దగ్గర లోని గుడి కి వెళ్లి అమ్మవారికి అర్చన చేయించింది . అలాగే వెంకటేశ్వర స్వామీ గుడికి వెళ్లి ఓ పెద్ద మొక్కు మొక్కు కుంది .
తమ్ముడు భరత్ మాత్రం అక్క కు ఇప్పటికే తన విష్ లిస్ట్ ఇచ్చేశాడు . అమెరికా కు వెళ్ళగానే తనకు కొని పంప  వలసిన ఐ పాడ్”, “X బాక్స్ ”  వగైరా, వగైరా .. అక్క  అమెరికా కు వెళ్ళగానే తమకు  డాలర్ల వర్షం కురుస్తుంది  అని వాడి భ్రమ .
ఒకరోజు ముందుగానే హైదరాబాద్ చేరుకొని మాధవి చెల్లెలి ఇంటిలో ఆ  రాత్రి బస చేశారు బిందు కుటుంబం. మాధవి చెల్లెలు కూడా చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది . బిందు అమెరికా చేరి సక్సెస్ అయితే తన పిల్లలకు కూడా ఒక దారి ఏర్పడుతుందని ఆమె ఆశ.
పొద్దున్నే లేచి ఇంటిల్లి పాది తల స్నానాలు చేసి, దేవుడి కి పూజ చేసుకొనిబిందు వాళ్ళ పిన్ని చేసిన ఉప్మా తిని , ఆటో లో అమెరికన్ కన్సొలేట్ చేరుకున్నారు. మరో రెండు గంటల్లో ఇంటర్వ్యూవ్.
కాన్సులేట్ బయట పెద్ద క్యూ .  లోపల జరిగే వీసా ఇంటర్వ్యూ ల గురించి కధలు కధలు గా చెప్పు కుంటున్నారు బయట నిలబడ్డ జనం.
మనసులో తన ఇష్ట దైవాన్ని ప్రార్ధిస్తూ క్యూ లో నిలబడింది బిందు.
నిన్న టి  రోజు డెబ్బై (70) శాతం మంది కి వీసాలు రిజెక్ట్ అయ్యాయి అని మాట్లాడు కుంటున్నారు క్యూ లో  నిలబడి ఉన్న  కొంత మంది అబ్బాయిలు.  . బిందు కు కొంచెం టెన్షన్ పెరిగింది .
తను నించుని వున్న లైన్ కొంచెం ఫాస్ట్ గానే కదిలి, మెయిన్ ఆఫీసు లోకి ప్రవేశించింది. బిందు డాక్యుమెంట్లన్నీ అక్కడ ఒక ఆఫీసర్ వెరిఫై చేసి , కౌంటర్ నెంబర్ 4 కు వెళ్ళమని చెప్పాడు .
వరుసగా ఐదారు కౌంటర్లు ఉన్నాయి అక్కడ . కౌంటర్ల వెనుక అమెరికన్ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లు నిలబడి, కౌంటర్ ముందు నిలబడి వున్న కాండిడేట్స్ ను ఇంటర్వ్యూ చేస్తున్నారు.
సినిమాల్లో తప్ప తెల్ల జాతి వాళ్ళను ప్రత్యక్షంగా చూడటం బిందు కి ఇదే  మొదటి సారి. వాళ్ళ డ్రస్ కోడ్ , వాళ్ళ మొహాలను , మాట తీరును  పరికించి చూస్తూ నాలుగో నంబర్ కౌంటర్ క్యూ లో నిలబడింది.
అక్కడి వరకు చాలా టెన్షన్ పడిన బిందు కు ఎందుకో ఒక్క సారి గా ఆ వాతావరణం చాలా కంఫర్ట్ గా అనిపించింది. అమెరికన్ తెల్లవాళ్లు, మన దేశస్తులను వీసా ఇంటర్వూ చేయడం, వాళ్ళ తో మన వాళ్ళు అమెరికన్ ఇంగ్లేష్ మాట్లాడ డానికి ప్రయత్నిస్తూ, తాపత్రయ పడటం , అమెరికన్ల దయా దాక్షిణ్యాల మీద మాత్రమే వచ్చే వీసాల కోసం టెన్షన్ పడటం …… ,  ఇవ్వన్నీ చూసే  సరికి ఆమె కి  ఒక రక మైన పట్టుదల వచ్చింది.
ఇంటర్వ్యూ లో సెలక్ట్ కాక పొతే ఏమవుతుంది ? ప్రాణం పోదుగా. ? …  అమెరికా లో చదివితేనే గొప్పా ఇండియాలో  కూడా చదువుకోవచ్చు, మంచి జాబ్స్ చెయ్యవచ్చు   …ఈ మాత్రానికే ఇంత భయం ఎందుకు ?  …  ఇలాంటి ఆలోచనలు బిందు మానసిక పరిస్థితిని నిర్వికారం చేశాయి .
లేత నీలం రంగు టాప్ మీద ఆరంజ్ కలర్ చున్నీ లోగోదావరి నది పై పరుచు కున్న తెల్లటి వెన్నెల్లో కలువ పువ్వు లా స్వచ్ఛంగా వికసిస్తుంది  బిందు.
పొడవాటి నల్లటి కురులు పర్వతం నుండి ప్రవహిస్తున్న జల పాతం లా భుజాల నుండి జారీ నడుము దాటి ఆపై … , కాళ్ళ పిక్కల ను చేరు తున్నాయి.  అమ్మాయిల కళ్ళు ఇంత అందంగా కూడా ఉంటాయా ? …  అని ఎదుటి వాళ్ళ చూపులు కట్టి పడేసే ఆమె నయనాలు, తల స్నానం చేయడం వలన నుదిటి పై చిరు నాట్యం చేస్తున్న ముంగురులు, చందమామ లో మాత్రమే కనిపించే ప్రశాంతత తో  హాయి గొలిపే వదనం ….
అక్కడి క్యూ ల్లో నిలబడి వున్న అబ్బాయి లు, అంత ఇంటర్వ్యూ టెన్షన్ లో ఉన్నా కూడా నిముషానికి ఒక్క  సారి అయినా  బిందు వంక చూడటం మాత్రం మర్చి పొవట్లేదు !
ఆమె ముందు క్యూ లో నిలబడి వున్న  అతను కౌంటర్ లో వున్న అమెరికన్ లేడీ నెక్స్ట్ ఇన్ ది లైన్అనగా నే నాలుగు అడుగులు వేసి కౌంటర్ ను చేరు కున్నాడు. అతని నుండి అన్ని డాక్యుమెంట్లు తీసుకుని ఇంటర్వ్యూ మొదలు పెట్టింది అమెరికన్ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ .
మోహంలో ఎలాంటి భావం లేకుండా, తన ముందు కౌంటర్ లో జరుగు తున్న తంతు అంతా  ప్రశాంత వదనం తో చూడ సాగింది  బిందు . ….
(సశేషం )
Written By..
Prasad Thota 


Comments